నిధి అగర్వాల్ కి స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలం..!!

18

తెలుగు తెరపైకి దూసుకొచ్చిన మరో అందాల తార నిధి అగర్వాల్. ఆమె నటించిన సవ్యసాచి చిత్రం ఇటీవల విడుదలై మంచి వసూళ్లను రాబడుతున్నది. నిధి అగర్వాల్ అందం, అభినయం సినీ విమర్శకులను సైతం ఆకట్టుకొన్నది. నాగచైతన్య, నిధి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకొన్నది.

ముఖ్యంగా గ్లామర్ మెరుపులు, డాన్స్, తన హావభావాలతో ఆదరగొట్టి అల్ రౌండ్ ప్రదర్శనతో మెప్పించింది..త్రంలో తన చిత్ర పాత్రకు వంద శాతం న్యాయం చేకూర్చడమే కాకుండా డాన్స్ అభినయంతో సినిమాలో తనే హైలైట్ గా నిలిచింది.. తొలి చిత్రంతోనే అందరిని ఆకట్టుకున్న ఈమెకి స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలున్నాయని ప్రేక్షకులు అంటున్నారు.

తెలుగులో తొలి చిత్రమైనా నటనతో మెప్పించడంతో ఆమె వైపు టాలీవుడ్ నిర్మాతల కన్ను పడింది. తెలుగు నిర్మాతల నుంచి భారీగా ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం. అటు అఖిల్ సినిమాలో నటిస్తుండడం తో అక్కినేని గర్ల్ గా పేరొచ్చినా ఇతర హీరోల చిత్రాల అవకాశాలు ఆమెకు వస్తున్నాయి.. అటు ఇంస్టాగ్రామ్ లోనూ ఈ పాతికేళ్ల సుందరి ఎంతో హుషారుగా అభిమానులను అలరిస్తుంది.. తన లేటెస్ట్ అప్డేట్స్ తో, ఫోటోలతో ఆకర్షిస్తూ మరింతమంది అభిమానులను సంపాదించుకుంటుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here