కుదిరిన పొత్తు.. సీట్ల ఎంపిక అంకం పూర్తయ్యింది..!!

48
mahakutami assembly seet comleted
mahakutami assembly seet comleted

తెలంగాణ మహాకూటమి లో సీట్ల అంకం పూర్తయ్యింది.. మొత్తం 119 సీట్లకు గాను కాంగ్రెస్ అత్యధికంగా 94 స్థానాల్లో పోటీ చేస్తుండగా, మిత్ర పక్షాలైన టీడీపీ కి 14 , టిజెఎస్ కు 8 , సిపిఐ కి 3 స్థానాల చొప్పున కేటాయించారు.. తెలంగాణ ఇంటి పార్టీ కి ఒక సీటు కేటాయించే అవకాశం ఉంది.. సిపిఐ కి వైరా, బెల్లంపల్లి, హుస్నాబాద్ సీట్లను కేటాయించారు.. అయితే తమకు కనీసం నాలుగు సీట్లనైనా కేటాయించాలని సిపిఐ పట్టుబడుతోంది..

టిజెఎస్ కు కేటాయించిన స్థానాల అభ్యర్థులను కూడా ప్రకటించింది.. మెదక్ – జనార్దన్ రెడ్డి, సిద్ధి పేట – భవాని రెడ్డి, దుబ్బాక – రాజ్ కుమార్, వరంగల్ ఈస్ట్ – ఇన్నయ్య, మల్కాజ్ గిరి – దిలీప్, మహబూబ్ నగర్ – రాజేందర్ రెడ్డి, చెన్నూరు , మిర్యాల గూడలో అభ్యర్థులను ఎంపిక చేయవలసి ఉంది.. పార్టీ అధినేత కోదండరాం పోటీకి దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here