ఫస్ట్ లుక్ కి సిద్ధమయిన బెల్లంకొండ సినిమా..!!

14
BSS5 Firstlook
BSS5 Firstlook

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటుండగా, ఈ షూటింగ్ లో గ్లామర్ బ్యూటీ కాజల్, సోను సూద్ లు పాల్గొన్నారు.. కనల్ కన్నా మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెన్స్ కి యాక్షన్ కొరియోగ్రఫీ ని అందించారు.. ఎకె ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీరి బ్యానర్ వస్తున్న 17వ సినిమా ఇది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి లక్ష్మి భూపాల్ మాటలు రాస్తుండగా శీర్ష రే సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. కాగా ఈ సినిమా తర్వాత శ్రీనివాస్ ఓ నూతన దర్శకుని సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా ఫస్ట్ లుక్ నేడు రిలీజ్ కాబోతుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here