విజయ్ ‘టాక్సీ వాలా’ కు అల్లు అర్జున్ హెల్ప్..!!

0
33
allu arjun for taxiwala pre release
allu arjun for taxiwala pre release

వరుస హిట్లతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండకు నోటా సినిమాతో గట్టి దెబ్బ పడింది.. వచ్చే వారం ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమా సక్సెస్ విజయ్ కి కీలకమైపోయింది.. దాంతో ఈ సినిమాపై మంచి క్రేజ్ వచ్చే విధంగా విజయ్ ప్లాన్స్ చేస్తున్నారు.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 11 న హైదరాబాద్ లో జరుగబోతున్నట్లు సమాచారం.. ఈ ఫంక్షన్ కు అల్లు అర్జున్ అతిధిగా రాబోతున్నాడు..

విజయ్ గీత గోవిందం సినిమా కు అల్లు అర్జున్ అతిధిగా వచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఆ కోవలోనే అల్లు అర్జున్ ఈ సినిమా కి వస్తే సినిమా సూపర్ హిట్ అవుతుందని విజయ్ దేవరకొండ సెంటిమెంట్ ని ఫాలో అవుతన్నాడు.. ఈ దీపావళి కి రిలీజ్ అయినా సినిమాలు కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో టాక్సీ వాలా కు ఇవన్నీ కలిసొచ్చే అంశంగా మారాయి.. విజయ్ మ్యానియాకి బన్నీ సెంటిమెంట్ తోడైతే మల్లి గీతగోవిందం సక్సెస్ రిపీట్ అవడం ఖాయమని నిర్మాతలు కూడా భావిస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here