సాయంత్రం చెన్నై కి చంద్రబాబు.. స్టాలిన్ తో కీలక భేటీ..!!

26
chandrbabu meet stalin in channai
chandrbabu meet stalin in channai

మోడీ వైఖరిపై విసుగు చెందిన చంద్రబాబు విపక్షాలను ఏకం చేసి బీజేపీ ప్రభుత్వాన్ని కూలదన్నే కార్యక్రమంలో భాగంగా నేడు చెన్నై కి వెళ్లనున్నారు చంద్రబాబు.. అక్కడ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ని కలిసి పలువురి నేతలతో భేటీ అవ్వనున్నారు.. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, జేడీఎస్ చీఫ్ హెచ్ డి దేవెగౌడ తో గురువారం చర్చలు జరిపిన అయన ఈరోజు సాయంత్రం చెన్నై కి వెళ్లనున్నారు.. సాయంత్రం 5 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరి 6 గంటలకు చెన్నై చేరుకుంటారు.. అక్కడినుండి రోడ్డు మార్గంలో ఆళ్వార్ పేటలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ నివాసానికి చేరుకుంటారు..

అనంతరం గంటపాటు ఇరువురు నేతలు సమావేశం కానున్నారు.. ఈ సమావేశంలో పలువురు నేతలు కూడా పాల్గొన్నారు.. అనంతరం చెన్నై విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని బేగం పేట విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.. సేవ్ కంట్రీ సేవ్ డెమోక్రసీ పేరుతో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసారు.. నేటి భేటీ తో ఈ పోరాటానికి ఓ రూపురేఖ్లు రానున్నాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here