భారత్ మిడిల్ ఆర్డర్ కి ఆటగాళ్లు ఇంకా కరువేనా..!!

347
team india middle order batsman
team india middle order batsman

ప్రపంచ కప్ దగ్గరవుతున్న వేళ టీం ఇండియా కి ప్రధాన సమస్య ఇంకా పొంచి ఉంది. అదే.. మిడిల్ ఆర్డర్.. టీం ఇండియా అంటేనే బ్యాట్టింగ్ కి పెద్ద పీట వేస్తుంది.. అనాదిగా టీం ఇండియా కి బ్యాటింగే బలం.. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మిడిల్ ఆర్డర్ సెట్ అవక టీం మానేజ్మెంట్ సతమతవుతుంది.. వరుస విజయాలు దక్కుతున్నా సమకాలీన క్రికెట్ కి అది శుభ శకునం కాదు..

ముఖ్యంగా ఇండియన్ క్రికెట్ ముగ్గురిమీదే ఆధారపడి గెలుస్తుంది.. ఓపెనర్లు, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఎవరో ఒక్కరు రాణిస్తే చాలు ఇండియా మ్యాచ్ గట్టెక్కేస్తుంది. వీళ్ళు విఫలమైతే విరాట్ కోహ్లీ ఉండనే ఉన్నాడు.. మొత్తానికి భారత్ టాప్ ఆర్డర్ ప్రపంచంలోనే అతుత్తమ టాప్ ఆర్డర్.. కానీ మిడిల్ ఆర్డర్ కి వస్తేనే చాల బలహీనంగా ఉంది.. 4,5,6 స్థానాల్లో అదే పనిగా ఆటగాళ్లను మార్చడం కూడా మిడిల్ ఆర్డర్ కూర్పు సరిగ్గా లేకుండా పోతుంది..

గతంలో గంగూలీ, ద్రావిడ్, యువరాజ్, కైఫ్ వంటి ఆటగాళ్లు మిడిల్ ఆర్డర్ ను ఎంతో బలపరిచి ఓపెనర్లు ఫెయిల్ అయినా తామున్నామంటూ అండగా నిలిచారు.. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నం.. ఎవరు ఏ మ్యాచ్ లో ఉంటారో చెప్పలేని పరిస్థితి.. ఒక మ్యాచ్ లో ఒక బ్యాట్స్ మన్ ఫెయిలయితే మరొకరు.. అతను కూడా ఫెయిల్ అయితే మరొకరు.. ఇలా మాటిమాటికి మిడిల్ ఆర్డర్ లో మార్పులు చేయడంతో ఆటగాళ్లు తమపై తాము నమ్మకం కోల్పోయేలా చేస్తుంది..

ప్రస్తుతం ఈ స్థానాలకు పోటీగా, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, కెఎల్ రాహుల్, దినేష్ కార్తిక్ , అంబటి రాయుడు, కేదార్ జాదవ్ లు పోటీపడుతుండగా.. ఒక సిరీస్ లో ఆడే ఆటగాడు మరో సిరీస్ లో ఆడని పరిస్థితి నెలకొంది.. ఎవరి సామర్ఢ్యమైన ఒక్క మ్యాచ్ , ఒక్క సిరీస్ తేలదు.. కొన్ని అవకాశాలు ఇవ్వాలి.. ఈ నేపథ్యంలో ఒక మ్యాచ్ అడగానే ఇంకొకరికి అవకాశం ఇవ్వడం వారి నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశముంది.. ధోని హయాంలో ఇలా మాటి మాటికీ టీం సభ్యులను మార్చే ఆలోచన లేదు.. అందుకే ధోని సక్సెస్ రేట్ చాల బాగుంది.. విరాట్ ఈ సమస్య గురించి ఆలోచిస్తే మంచింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here