అరవింద సమేత రివ్యూ…

1929
aravinda sametha review and rating
aravinda sametha review and rating

సినిమా : అరవింద సమేత
బ్యానర్ : హారిక & హాసిని క్రియేషన్స్
నటీనటులు : ఎన్టీఆర్ , పూజ హెగ్డే,ఈషా రెబ్బా, జగపతిబాబు, నాగబాబు
ఎడిటర్ : నవీన్ నూలి..
సినిమాటోగ్రాఫర్ : పీ ఎస్ వినోద్
మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.ఎస్.తమన్
దర్శకుడు : త్రివిక్రమ్
నిర్మాత : రాధాకృష్ణ (చినబాబు)
రన్ టైం : 161.30 నిముషాలు..
విడుదల తేదీ : 11 అక్టోబర్ 2018

నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది… తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేయి కళ్ళతో చూస్తున్న క్షణం వచ్చేసింది.. ఎన్టీఆర్ హీరో గా తొలిసారి త్రివిక్రమ్ కలయికలో చేస్తున్న అరవింద సమేత సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది… పూజ హెగ్డే కథానాయిక గా నటిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది.. పాటలు, ట్రైలర్ లతో ఎంతో క్రేజ్ ని సంపాదించుకున్న ఈ చిత్రం ఎలా ఉందొ ఈ సమీక్షలో తెలుసుకుందాం..

కథ విషయానికొస్తే,

రాయల సీమలోని ఒక ఊరులో ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే కథ ఇది.. ఇరు వర్గాల మధ్య ఏర్పడిన గొడవని హీరో ఎలా తన ఆలోచనలతో శాంతపరిచారు.. ఫ్యాక్షన్ తో అట్టుడికిపోతున్న ఊరును ఎలా శాంతి వైపు మరల్చాడు అనేదే సినిమా కథ.. విలన్ ని గాయపరిచిన హీరో పై పగ సాధించే క్రమంలో విలన్ వేసిన ఎత్తులు హీరో పై ఎత్తులు అందుకోసం జరిగిన మారణ హోమం , ఫ్యాక్షన్ ని ఆపి శాంతిని నెలకొల్పాలన్న థాట్ హీరో కి ప్రేరణ ఎక్కడిది.. ఈజర్నీ లో హీరోయిన్ ఎలా తారసపడింది.. చివరకు హీరో ఎలా తన లక్ష్యాన్ని సాధించాడు అనేదే సినిమా కథ..

నటీనటులు ,

ఎన్టీఆర్ వీరరాఘవుడి పాత్రలో తన నటవిశ్వరూపాన్ని చూపించాడని చెప్పొచ్చు.. సినిమా కి మెయిన్ పిల్లర్ తారకే.. తనదైన శైలిలో భావోద్వేగ సన్నివేశాలు, రౌద్ర సన్నివేశాలలో తిరుగులేని పెర్ఫార్మెన్స ఇచ్చారు.. డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొనవసరంలేదు.. హీరోయిన్ పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంత సేపు బాగానే అలరించింది.. ఈషా రెబ్బ రెండు మూడు సీన్లకు మినహా పెద్దగా కనిపించలేదు.. సునీల్ రీ ఎంట్రీ చిత్రంగా చెప్పినా సునీల్ ని ఈ సినిమా ద్వారా పెద్ద గా యూస్ చేసుకోలేదు త్రివిక్రమ్.. ఈ సినిమా లో మరో హైలైట్ జగపతి బాబు.. మునుపెన్నడూ లేని విధం గా సినిమా లో నటించి సినిమా కు ప్రాణం పోశాడు.. విలన్ కొడుకు పాత్రలో నవీన్ చంద్ర అలరించాడు..

సాంకేతిక నిపుణులు :

టెక్నికల్ విభాగానికి వస్తే అన్ని విభాగాల సాంకేతిక నిపుణులు చాల బాగా వర్క్ చేసారు.. పీఎస్ వినోద్ కెమెరా బాగుంది.. విజువల్స్ చాల బాగా వచ్చాయి.. తమన్ సంగీతం గురించి చెప్పనవసరం లేదు.. మనసుకు హత్తుకునే బాణీలతో పాటు, అద్భుతమైన నేపథ్య సంగీతం అందించాడు.. ఎడిటర్ నవీన్ నూలి ఫస్ట్ హాఫ్ లో కొంచెం కష్టపడితే బాగుండనిపిస్తుంది రామ్ లక్ష్మణ్ ఫైట్స్ , ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ లు బాగా పనిచేశారు.. హారిక & హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు.. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ విషయానికొస్తే యుద్ధం చేసేవాడు కాదు రాకుండా ఆపేవాడే గొప్పోడు అనే నేపథ్యం తో అయన రాసిన కథ బాగానే ఉన్నా స్క్రీన్ ప్లే విషయం లో జాగ్రత్తలు తీసుకోవాల్సింది.. కథ కొంచెం స్లో గా మొదలవడం ఆడియెన్స్ ఎక్స్పెక్టషన్స్ కి దగ్గరగా ఉండడం మైనస్.. సంభాషణల విషయంలో త్రివిక్రమ్ ని మించిన వారు లేరని మరో సారి ప్రూవ్ చేసుకున్నారు.. యాక్షన్ ఎపిసోడ్స్ వెరైటీ గా డిజైన్ చేసాడు.. ఫైనల్ గా త్రివిక్రమ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత త్రివిక్రమ్ ఫామ్ లోకి వచ్చేసి నట్లే కనిపిస్తుంది..

ప్లస్ పాయింట్స్ :

ఎన్టీఆర్.

సెకండ్ హాఫ్

మ్యూజిక్

ఇంటర్వెల్ బాంగ్

మైనస్ పాయింట్స్ :

స్క్రీన్ ప్లే

కామెడీ లేకపోవడం

హీరోయిన్

ఫైనల్ గా…

ఫ్యాక్షన్ సినిమా గా వచ్చిన ఈ సినిమా లో ఎన్టీఆర్ నటన, త్రివిక్రమ్ డైరెక్షన్ అంత బాగానే ఉన్నా కామెడీ, మాస్ ప్రేక్షకులను మెప్పించే అంశాలు లేకపోవడం మైనస్ .. ఈ సినిమా అన్ని వర్గాలను మెప్పించేలానే ఉంది.. కానీ మాస్ లో పల్స్ తగ్గుతుంది.. ఏదేమైనా పండగ సమయంలో ఎన్టీఆర్ కి మంచి హిట్టే వచ్చింది..

రేటింగ్ : 3.5 /5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here