త్వరలో ఇంటి కొచ్చేస్తా.. కాన్సర్ తో నరకం చూసాను – సోనాలి..!!

19
sonali bindre cancer news
sonali bindre cancer news
ఉన్నన్నాళ్ళు సినిమాల్లో తన గ్లామర్ తో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ సోనాలి బింద్రే.. తనకు కాన్సర్ ఉందని ప్రస్తుతం చికిత్స పొందుతున్నానని వెల్లడించిన సంగతి తెలిసిందే.. తాజాగా త్వరలో ఇంటికొస్తున్నానని ఆమె ట్వీట్ పెట్టడం ఆమె అభిమానులకు సంతోషం కలిగించినా ఆమె ట్వీట్ లో రాసిన రాతలు అందరికి కంటనీరు తెచ్చేవిధంగా ఉన్నాయి..
 
హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆమె పెట్టిన ఈ ట్వీట్ ఎంతటివారికి బాధకలిగిస్తుంది.. తన ఆవేదనను మొత్తం ఈ ట్వీట్ లో వ్యక్తపరిచింది.. ” గత కొన్ని నెలలుగా నాకు మంచి చెడు రెండు ఎదురయ్యాయి.. చాలా బలహీనపడిపోయీ కనీసం చేతి వేలు ఎత్తడానికి శక్తిలేక బాధపడ్డాను.. ఇది కూడా ఓ ప్రక్రియల అనిపిస్తుంది.. శారీరకంగా ప్రారంభమైన నొప్పి..
 
మానసికంగా ఎమోషనల్ గా దెబ్బతీస్తుంది.. కీమో తెరపీ సర్జరీ తర్వాత కొన్ని రోజులు చాలా కష్టమైంది.. కనీసం నవ్వినా నొప్పి వచ్చేది..  ఇలాంటి చెడు రోజులు జీవితంలో వస్తాయి.. ఇప్పుడు నాకు చికిత్స జరుగుతుంది.. నా రూపు కాస్త చక్కగా మారింది.. త్వరలో ఇంటికొచ్చేస్తాను అని సోనాలి పోస్ట్ లో పేర్కొన్నారు.. 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here