తెలంగాణ మహాకూటమిలో చీలికలు.. సీట్ల విషయంలో చిక్కులు..!!

114
problems on telangana mahakutami
problems on telangana mahakutami
తెలంగాణాలో టీఆరెస్ ని గద్దె దించేందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అన్ని ప్రతిపక్షాలతో కలసి మహాకూటమిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. టీడీపీ తో పొత్తు, కోందండరాం పార్టీ తో కలయిక వెరసి ఈ ఎన్నికల్లో కేసీఆర్ ని దించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.. అయితే కేసీఆర్ విషయం ఏంటో గానీ మహాకూటమిలోని చీలికలు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది..
 
సీట్ల కేటాయింపు విషయంలో మహాకూటమిలో పెద్ద చిక్కు వచ్చి పడుతుందట.. మహాకూటమిలో చేరిన పార్టీలు తాము కోరిన సీట్లు కేటాయించని పక్షంలో సొంతంగా ఆయా నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సిద్ధం అవుతామని హెచ్చరిస్తున్నాయట.. ముఖ్యంగా కోదండరాం పార్టీ ఈ విషయంలో నిక్కచ్చిగా ఉందట.. సీట్ల కేటాయింపు విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి కాంగ్రెస్ కు డెడ్ లైన్ పెట్టిందట..
 
అడిగిన 19 సీట్లు ఇవ్వని పక్షంలో సొంతంగా అభ్యర్తల  జాబితాను విడుదల చేస్తామని కోదండరాం ప్రకటించారు.. దీంతో కాంగ్రెస్ ఎలా ఈ విషయాన్నీ సాల్వ్ చేయాలో తెలీక మల్లగుల్లాలు పడుతుందట..ఇటు కోదండరాం మాత్రం 21 మందితో తొలిజాబితా, 25 మందితో రెండో జాబితాతో  సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ వైఖరి మారకపోతే రెండు రోజుల్లో జాబితా ని విడుదల చేస్తామని స్పష్టం చేశారు.. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here