నేను సీఎం అవ్వాలనుకుంటే ఎప్పుడో అయ్యేవాడిని – పవన్ కళ్యాణ్..!!

23
pawan about political career
pawan about political career
పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా సెన్సేషనే.. ఏం చేసిన వండరే.. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజా పోరాట యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ తాను సీఎం అవ్వాలనుకుంటే ఎప్పుడో అయ్యేవాడినని, కానీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, అధికారం కోసం కాదని వెల్లడించారు..
 
గతంలో జనసేన పార్టీ ని అమిత్ షా బిజెపి లో కలపాలని కోరగా, అందుకు సీఎం పదవి నాకే ఇస్తామని ఆఫర్ వచ్చింది.. అయితే అందుకు  తాను అందుకు సిద్ధంగా లేనని అయినా నా పార్టీ ని ఏ పార్టీ లో కలిపే ఉద్దేశ్యంతో పార్టీ స్థాపించలేదని, క్లీన్ పాలిటిక్స్ చేయడం కోసం మాత్రమే నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు..
 
దాంతో అయన ఏం మాట్లాడలేకపోయారు అని చెప్పారు.. జగన్ లా సీఎం అవ్వాలనే కోరిక నాకు లేదని, ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరిస్తామని, జగన్ లా ముఖ్యమంత్రి అయ్యాక పరిష్కరిస్తామని చెప్పడం నేను కాదని అయన అన్నారు..2016 లో కేంద్రానికి ప్రత్యేక హోదా గుర్తుచేసింది నేను అన్నారు. పార్టీ గురించి మాట్లాడుతూ అరచేతిలో సూర్యకాంతిని ఎవరు ఆపలేరని, జనసేన ఎదుగులని , విజయాన్ని ఎవరు ఎదుర్కోలేరని వ్యాఖ్యానించారు.. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here