గిడ్డి ఈశ్వరికి 2 నెలల గడువు విధించిన మావోయిస్టులు..!!

199
movoists target on giddi eashwari
movoists target on giddi eashwari
మరో ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ని మావోయిస్టులు  టార్గెట్ చేసారు.. రెండు నెలల తర్వాత కిడారి ని చంపిన రీతిలోనే ఆమెను హత్య చేస్తామని ఓ లేఖలో స్పష్టంగా గడువు విధించడంతో గిడ్డి లో ఇప్పుడు టెన్షన్ మొదలైంది. వైసిపి తరపున విశాఖ పట్నం జిల్లా పాడేరు నియోజకవర్గంలో గెలిచినా గిడ్డి ఈశ్వరి 20 కోట్లు తీసుకుని టీడీపీ లో జాయిన్ అయినా విషయం తమకు తెలుసనీ ఆమెను తుదిముట్టించడం ఖాయం అన్నారు.. 
 
కిడారి ని చంపే సమయంలో ప్రజా కోర్టు పేరుతో గిరిజనుల సమక్షంలో కిడారిని వివరాలడిగి సేకరించగా, ఫిరాయింపునకు 12 కోట్లు తీసుకున్నానని అంగీకరించగా, అక్కడ గిడ్డి ఈశ్వరి ప్రస్తావన కూడా రాగ టీడీపీ లోకి వెళ్లేందుకు మంత్రి పదవి హామీతో పాటు 20 కోట్లు తీసుకున్నారని లేఖలో మావోయిసులు పేర్కొన్నారు..
 
రెండు నెలల్లో ఈశ్వరి తీసుకున్న 20 కోట్లు గిరిజనులకు పంచాలని, బాక్సయిట్ గనుల తవ్వకాలను వ్యతిరేకించాలని చెప్పారు. ఇవన్నీ రెండు నెలల్లో చేయకపోతే గిడ్డిని కూడా కిడారిని చంపినట్లే చంపేస్తామని హెచ్చరించారు.. మరి మావోయిస్టుల ఈ హెచ్చరికతో గిడ్డి ఈశ్వరి ఏం చేస్తుందో చూడాలి మరీ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here