గీత గోవిందం డైరెక్టర్ పై రష్మిక సెన్సేషనల్ కామెంట్స్..!!

38
rashmika comments on geetha govindam director
rashmika comments on geetha govindam director
రష్మిక నడిచిన గీతగోవిందం, దేవదాసు సినిమా సూపర్ హిట్ అవడంతో తెలుగులో ఆమె ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తున్నాయి.. లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చేతిలో ఇప్పుడు బడా సినిమాలున్నాయి.. కాగా తాజాగా ఆమె మీడియా తో ముచ్చటిస్తూ కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చెప్పింది.. తాను అల్లరి పిల్లలా కనిపించినప్పటికీ చాల సున్నితమైన మనిషినని, ఎవరైనా ముభావంగా కనిపిస్తే తనవల్ల వాళ్ళు బాధపడుతున్నారా అని ఆలోచించే టైపు అని వెల్లడించింది. 
 
ఈ సందర్భంగా ఆమె గీత గోవిందం డైరెక్టర్ తో జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ని తెలియజేసింది. ఓ సారి షూటింగ్ స్పాట్ కి వెళ్లడం ఆలస్యమైందని రష్మిక తెలిపింది.. ‘ నాతో ఎవరైనా నవ్వుతు మాట్లాకపోతే చాల డిస్టర్బ్ అయిపోతాను.. ఆరోజు షూటింగ్ స్పాట్ కి లేట్ గా వెళ్లడంతో  నాతో ఎవ్వరు మాట్లాడలేదు.. నేను వెళ్లి   పలకరించినా ఎవరు మాట్లాడలేదు.. ఓ చోట కూర్చుని ఏడ్చేసా.. వెంటనే దర్శకుడు పరశురామ్ పరిగెత్తుకుంటూ వచ్చి ” నిన్ను ఆటపట్టింహడానికే ఇదంతా చేసాం.. అంటూ ఓదార్చారు..అప్పటివరకు నన్ను ఫాలో అవుతున్న కెమెరాని పరశురామ్ చూపించారు.. అసలు ఓ కెమెరా నన్ను ఫాలో అవుతుందని అప్పటివరకు నాకు తెలియదు అని ఈ ఘటనని రష్మిక గుర్తుచేసుకుంది.. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here