అరవింద సమేత సెన్సార్ టాక్.. రికార్డుల మోతే..!!

533
aravinda sametha censor talk
aravinda sametha censor talk
ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాపై రోజు రోజు కి అంచనాలు పెరిగిపోతున్నాయి.. అభిమానులైతే సినిమా కోసం వేయి కన్నులతో ఎదురు చూస్తున్నారు.. జై లవకుశ సినిమా తర్వాత ఆకలితో ఎదురు చూస్తున్న అభిమానులకు ఎన్టీఆర్ ఫుల్ మీల్స్ లాంటి సినిమా తెస్తుండడం , పైగా దానికి త్రివిక్రమ్ దర్శకుడు కావడం సినిమా పై ఎన్నడూ లేని అంచనాలను ఏర్పడ్డాయి..
 
నిజానికి ఎన్టీఆర్ సినిమా అంటేనే అలాంటి పండగ వాతావరణం టెంపర్ సినిమా నుంచి వస్తుండగా, సినిమా సినిమా కి ఎన్టీఆర్ అలాగే యాటిట్యూడ్ చూపిస్తూ నెంబర్ వన్ రేస్ కి మరింత దగ్గరవుతున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తయ్యింది. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమాలో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కనిపించాయని కితాబిస్తున్నారు.. సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ రాగ, సినిమా మాత్రం అదిరిపోయిందని అంటున్నారు..
 
ఎన్టీఆర్ చేసిన సినిమాల్లో టెంపర్ తర్వాత అంత డెప్త్ అండ్ బెస్ట్ కంటెంట్ ఇందులోనే ఉందని అంటున్నారు..కాకపోతే సినిమా కంటెంట్ ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని, సినిమా పూర్తయ్యేకల్లా సినిమాచూసిన ప్రతి ఒక్కరు సినిమా సూపర్ హిట్ అనడం ఖాయం అంటున్నారు.. సెకండ్ హాఫ్ సినిమాకి ఆయువు పట్టు అంటున్నారు..
 
తెలుగు సినిమా ల్లో లేనివిధంగా దర్శకుడు సినిమా సెకండ్ హాఫ్ ని తీర్చిదిద్దారట.. ఇంటర్వెల్ ముందు సీన్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయట.. ఇదే సెన్సార్ టాక్ బయట కూడా వస్తే బాహుబలి రికార్డులను కొల్లగొట్టడం ఖాయం అంటున్నారు. 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here