తీగలాగితే డొంక కదులుతుందనే చంద్రబాబు భయం..!!

162
ys jagan fires on chandrababu
ys jagan fires on chandrababu

ఆదాయపు పన్ను శాఖ ఎవరింట్లోనో సోదాలు చేస్తే నీ వెన్నులో ఎందుకు ఉలికిపాటు అని చంద్రబాబు ను ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రశ్నించారు.. తీగలాగితే డొంక కదులుతుందన్న భయంతోనే చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు.. చంద్రబాబు ఒక్కో నియోజక వర్గానికి 30 కోట్లు చేసిన పంపిణి బయటపడుతుందనే భయంతో , ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన వ్యవహారం ఎక్కడ భయటపడుతుందన్న భయంతో , నాలుగేళ్లుగా నాలుగు లక్షల కోట్లు దోచుకున్న చంద్రబాబు అవినీతి ఎక్కడ భయటపడుతుందన్న భయంతోనే చంద్రబాబు భయపడుతున్నాడు అని అయన అన్నారు..

విజయనగరం జిల్లా చీపురు పల్లి నియోజక వర్గంలో గుర్ల లో జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో అయన ఈ ఆరోపణలు చేశారు.. అంతేకాదు చంద్రబాబు కు వంతపాడుతున్న ఎల్లో మీడియా పై నిప్పులు చెరిగారు.. ఐటీ దాడులపై ఎందుకంత భయపైపోతున్నారో అర్థకావట్లేదు. ఆయన అలా భయపడడానికి కారణం అయన ఇంట్లోనే ఎక్కవుగా అవినీతి ఉండడం. అని అన్నారు.

ఎల్లో మీడియా ని విమర్శిస్తూ ఎక్కడో ఐటీ సోదాలు జరిగితే చంద్రబాబు నాయుడుకు అండగా నిలబడుతూ అయినా ఆకాశానికెత్తేసిన ఎల్లోమీడియా ని చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. ఆయన్ను తాండ్ర పాపా రాయుడుగా, కేంద్రంతో పోరాడుతున్న పోరాట యోధుడిగా , హీరోగా చూపించాలని ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు హోదా వద్దంటే దాన్ని సమర్ధించే ప్రయత్నం చేస్తుంది. అదేదో గొప్ప నిర్యాణం లా చూపిస్తుంది.. చివరి నిమిషంలో చంద్రబాబు ప్లేట్ ఫిరాయిస్తే అది చారిత్రాత్మక నిర్ణయంగా చూపిస్తుంది. అని విమర్శించారు.. దిగుజారుగుకు పరాకాష్టగా మారింది ఎల్లో మీడియా అని అన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here