అధికారం కోసం ఇంత కక్కుర్తా.. ఏంటీ టీడీపీ డ్రామా..!!

114
tdp notification infront of elactions
tdp notification infront of elactions

నాలుగున్నరేళ్లుగా ఉద్యోగాల గురించి పట్టించుకోని రాష్ట్రప్రభుత్వం తీరా ఎన్నికలు దగ్గరపడుతుండంతో నోటిఫికెషన్స్ విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం కక్కుర్తిని , అధికారం కోసం దాహాన్ని వ్యక్తపరిచేలా చేసుకుంది.. నాలుగున్నరేళ్లుగా ఖాళీగా ఉన్నా 2 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇప్పటి వరకు విడుదల చేయకపోగా, ఇన్ని రోజులు నిరుద్యోగులను నిలువునా వంచించి ఇప్పుడు వారి ఓట్లకోసం ఈ నోటిఫికేషన్ల డ్రామా ఆడుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి..

గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒకటి ప్రతి ఏటా ఉద్యోగాల నోటిఫికెషన్స్ విడుదల చేస్తామని, కానీ పగ్గాలు చేప్పట్టిన రెండేళ్ల దాకా ఆ ఊసే తీయకుండా ఎదో నామమాత్రంగా నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్నారు అని విమర్శిస్తున్నారు.. 2016 తర్వాత చంద్రబాబు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు.. రెండు లక్షలకు పైగా ఖాళీగా ఉన్నా.. 70 వేలు మాత్రమే అందులో 20 వేలు మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ స్థానాలు ఖాళీగా ఉన్నాయని ఆయా అధికారులు నివేదికలు పంపించిన పట్టించుకోకుండా తమ లబ్ది కోసం ఇన్ని రోజులు ఆపి ఇప్పుడు నోటిఫికెషన్స్ వేయడం ఎవరికీ రుచించడం లేదు.. గతంలో కూడా ఎన్నికల సమయంలో విడుదల చేసిన నోటిఫికెషన్స్ ఫలితాలు ఎలా ఉన్నాయో అందరికి తెలుసు.. ఒక్కసారి పోస్టుల భర్తీలు జరగడానికి ఏళ్ళు పట్టింది.. మరి ఇలా ఎన్నికల ముందు నోటిఫికెషన్స్ రావడంతో ఎంత నష్టం ఉందొ తెలిసి కూడా విడుదల చేయడం టీడీపీ స్వార్ధపూరిత రాజకీయం దాగుందని అంటున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here