చెర్రీ సినిమా వెరైటీ టైటిల్..!!

25
ram charan boyapati cinema title
ram charan boyapati cinema title

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ షెరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే చాల భాగం షూటింగ్ అయ్యింది. ఇటీవలే కీలక యాక్షన్ సన్నివేశాలను పూర్తిచేసింది.. అయితే ఈ సినిమా టైటిల్ ని మాత్రం ఇంతవరకు రివీల్ చేయలేదు చిత్ర బృందం.. చిరు బర్త్ డే కి గానీ, పవన్ బర్త్ డే కి గానీ సినిమా అప్ డేట్ వస్తుందని భావించిన అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు.. కనీసం దసరాకైనా సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ చేస్తారని అభిమానులు గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు..

2019 సంక్రాంతి కి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కి టైటిల్ గా మొన్నటిదాకా ‘స్టేట్ రౌడీ’ అన్నారు.. నిన్న ‘తమ్ముడు’అన్నారు..ఈ రెండు కాకుండా ‘రౌడీ తమ్ముడు ‘ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట.. కానీ లేటెస్ట్ గా సినిమా టైటిల్ ని ‘వినయ విధేయ రామ’ గా మార్చారని తెలుస్తుంది. ఈ టైటిల్ అభిమానులకు అంతగా రుచించకపోయినా సినిమా టైటిల్ ఏదీ అనేది ఈ దసరాకి రివీల్ చేయనున్నారట.. రంగస్థలం తర్వాత చరణ్ చేస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలుండగా, ఎన్టీఆర్ బయోపిక్ తో పోటీపడుతున్న ఏ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here