స్టార్ డైరెక్టర్ పై కంగనా బూతులు..!!

266
kangana comments on queen director
kangana comments on queen director

కాస్టింగ్ కౌచ్ పై ఒక్కఓక్కరు నోరు విప్పి ఇండస్ట్రీ ప్రముఖులను షేక్ చేస్తున్నారు.. డైరెక్ట్ గా పేర్లు చెప్పి కాస్టింగ్ కౌచ్ కి పాల్పడిన వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు.. మొదట టాలీవుడ్ లో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు బాలీవుడ్ లో మొదలైంది..అక్కడ తనుశ్రీదత్త , నానా పటేకర్ ల వివాదం ఎంత పెద్దమొత్తంలో చర్చకు దారితీసిందో అందరికి తెలిసిందే.. అది పూర్తిగా మరిచిపోకముందే మరో హీరోయిన్ ఓ స్టార్ డైరెక్టర్ ని నిందిస్తూ ఆరోపణలు చేసింది.

తెలుగులో పూరీజగన్నాధ్ ఏక్ నిరంజన్ సినిమా చేసిన కంగనా రనౌత్ ఆమె చేసిన క్వీన్ సినిమా డైరెక్టర్ పై సంచలన ఆరోపణలు చేసింది.. క్వీన్ సినిమా షూటింగ్ టైం ఆ సినిమా దర్శకుడు వికాస్ బెహెల్ తనపై లైంగీకగా దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు చేసింది.. వికాస్ తనను వేధిస్తున్నాడని, ఫాంటమ్ ఫిలిం సంస్థకు చెందిన ఓ యువతీ ఆరోపిస్తున్న నేపథ్యంలో కంగనా ఆమెకు మద్దతుగా ముందుకొచ్చింది. కాగా ఫాంటమ్ ను దర్శకులు అనురాగ్ కశ్యప్, వికాస్, నిర్మాత మధు మంతెన కలిసి స్థాపించారు. ఇందులో పనిచేసిన సదరు యువతీ ని వికాస్ వేధించడం వంద శాతం నిజమేనని వెల్లడించింది..

కంగనా మాట్లాడుతూ.. క్వీన్ సినిమా జరుగుతున్న సమయంలో నన్ను విష్ చేస్తున్నట్లు తన కౌగిట్లో నలిపేషెవాడు కాకపోతే అది ఎవరికీ తెలీకుండా మేనేజ్ చేసేవాడు కానీ ఆ బాధ నాకు మంత్రమే అర్థమయ్యేది.. వికాస్ కు పెళ్లయినా పరాయి స్త్రీలతో సంబంధం ఉంది.. ఇతరుల వ్యక్తిగత అలవాట్లగురించి నేనెప్పుడూ తప్పుబట్టాను. కానీ ఇలాంటి నీచమైన పనులు చేస్తే తప్పుపడతారు అంది.. అన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here