వెరైటీ టైటిల్ తో ప్రభాస్ సినిమా..!!

30
french title for prabhas movie
french title for prabhas movie

సాహో సినిమా తర్వాత ఓ లవ్ స్టోరీ చేస్తున్నాడు ప్రభాస్.. రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, పూజ హెగ్డే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ ఇటలీ లో జరుగుతుంది..1970 లో పిరియాడికల్ ప్రేమకథ చిత్రంగా వస్తున్న ఈ సినిమా కు కాష్ఠంత ఫాంటసి, యాక్షన్ థ్రిల్లర్ ను జోడించారట.. ఇప్పటికే సినిమా కి సంబంధించిన అన్ని పనులు ఎంతో గ్రాండ్ గా తీర్చిదిద్దారట.. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం కు అప్పుడే వర్కింగ్ టైటిల్ పెట్టేశారట.. ఈ చిత్రానికి టైటిల్ గా ‘ఆమూర్ ‘ అనే పేరును ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట.. ఆమూర్ అంటే ఫ్రెంచ్ లో ప్రేమ అని అర్థం..

ప్రభాస్ ప్రస్తుతం ‘ సాహో’ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్.. దాదాపు బాలీవుడ్ కి చెందిన అగ్రనటులందరు ఈ చిత్రంలో కనిపించనున్నారు.. భారీ బడ్జెట్ తో యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యమిస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.. వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here