ఆయుష్మాన్ భారత్ అట్టర్ ఫ్లాపేనా.. ఆరోగ్యశ్రీనే మేలు..!!

81
modi in rafel scam
modi in rafel scam

నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్ట్ ఆయుష్మాన్ భారత్.. ఇటీవలే ఈ పథకాన్ని ప్రారంభించగా ఈ పథకం జనాలకు చేరువ అవడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యేలా కనిపిస్తుంది.. అందుకు ఈ ఆయుష్మాన్ భారత్ నిబంధనలే కారణం.. నిజానికి ఈ పథకం కన్నా ఆరోగ్య శ్రీ పథకమే మేలు అని ఈ దిశా దశాల్లేని నిభందనలు చూస్తే తెలుస్తుంది..

ఆయుష్మాన్ భారత్ పథకం పూర్తి స్థాయిలో సేవలందిస్తే ప్రజల మధ్య విద్వేషాలు రేగే ప్రమాదం ఉంది. ఎలా అంటే దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికి ఈ పథకంద్వారా 5 లక్షల వరకు వైద్య సేవలు అందుతాయి.. అయితే కేంద్ర గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఈ సంఖ్య 26.11 లక్షల మంది ఉన్నారు.. అయితే ఆరోగ్య శ్రీ ద్వారా ఇప్పటికే భారతేదేశం మొత్తనా 77 .19 లక్షల కుటుంబాలకు ఆరోగ్య శ్రీ పథకం సేవలందిస్తుండగా, ఒకవేళ ఆయుష్మాన్ భారత్ ద్వారా వైద్య సేవలొస్తే మిగితా యాభై లక్షల మందికి ఈ పథకం ద్వారా ఎలాంటి సేవలు వినియోగించుకోలేరు..

అంటే ఒక గ్రామంలో ఒకరు ఆయుష్మాన్ భారత్ ద్వారా వచ్చే 2 నుంచి 13 లక్షల లబ్ది ని పొందితే ఈ పథకంలో లేని వారు ఆరోగ్య శ్రీ లోని ఐదు లక్షల లబ్ది ని పొందుతారు.. దాంతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.. ఈ ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అరవై శాతం కేంద్రం, నలభై శాతం రాష్ట్రప్రభుత్వం భరించాలి.. అటు ఆరోగ్యశ్రీ పథకం పై అయ్యే ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి..

ఇన్ని ఖర్చులయ్యే సరికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్మాన్ భారత్ ని పెద్దగా పట్టించుకోవట్లేదు. అటు కార్పొరేట్ సంస్థలు కూడా ఈ పతాకంపై పెద్ద గా ఆసక్తి చూపించట్లేదు. దాదాపు ఎనభై శాతానికి పైగా శస్త్ర చికిత్సలు ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న ఆరోగ్య శ్రీ ధరల కంటే చాల తక్కువ గా ఉండడం కార్పొరేట్ ఆస్పత్రులకు ఈ పథకం పెద్దగా రుచించడం లేదు..

ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు కాంప్రమైజ్ అయ్యి ఈ పథకాన్ని అమలుకు తెచ్చినా ఏ క్రెడిట్ అంత కేంద్రానికే వెళ్ళిపోతుందని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పతాకంపై ఇంట్రెస్ట్ చూపించే ప్రసక్తే లేదు.. . ఎటు చూసినా ఆయుష్మాన్ భారత్ కి పెద్దగా ఆయుష్షు ఉన్నట్లు కనిపించట్లేదు..మరి ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మోడీ వేసిన ఈ ప్లాన్ సక్సెస్ అయ్యేనా.. ఆయుష్మాన్ భారత్ లో మొత్తం 1350 రకాల చికిత్సలు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here