నోటా రివ్యూ 

526
nota movie review
nota movie review
నటీనటులు : విజయ్ దేవరకొండ, మెహ్రీన్ కౌర్, సత్యరాజ్, నాజర్
ఎడిటర్ : 
మ్యూజిక్ డైరెక్టర్ : సామ్ సి సుందర్
దర్శకుడు : ఆనంద్ శంకర్ 
నిర్మాత : జ్ఞానవేల్ రాజా 
విడుదల తేదీ : 05 అక్టోబర్ 2018
 
సౌత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న తాజా సినిమా నోటా .. ప్రస్తుతం రాజకీయాల పరిస్థితులపై తెరకెక్కిన ఈ సినిమా లో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి గా నటిస్తున్నారు. తమిళ నాట మంచి దర్శకునిగా పేరు తెచ్చుకున్న ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు.. ఈ సినిమా ద్వారా అటు కోలీవుడ్ లో నూ విజయ్ హీరో గా పరిచయమవుతుండడంతో సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. మరి ఈ సినిమా ద్వారా విజయ్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడా లేదా అనేది చూడాలి. 
 
కథ విషయానికొస్తే, 
 
లండన్ లో వీడియో గేమ్స్ డిజైనర్ గా  పనిచేసే వరుణ్ (విజయ్ దేవరకొండ) ముఖ్యమంత్రి వాసుదేవ్ (నాజర్) కొడుకు.. ఒకసారి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి వచ్చిన వరుణ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాల్సిన పరిస్థితి.. అసలే రాజకీయాలంటే గిట్టని వరుణ్  కొన్ని అనాధాశ్రమాలకు  మహేంద్ర (సత్యరాజ్) ద్వారా సహాయం చేస్తాడు..  తండ్రి ఒక కేసు విచారణ నిమిత్తం జైలు కి వెళ్లగా వెనకాల ఉంది వరుణ్ తో అన్నీ చేయిద్దామనుకుంటాడు.. కానీ బెయిల్ రాకపోవడం, కేసు తీవ్రతరం అవుతుండడం తో వరుణ్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి.. ఇంతలో తండ్రిపై హత్యా ప్రయత్నం చేసిన వ్యక్తులు తనపై కూడా చేస్తారని దీనివెనుక కొన్ని కోట్ల కుంభకోణం దాగుందని ఇంటలిజెన్స్ వర్గాలు చెప్తాయి.. ఈలోగా వరుణ్ అధికారంలో ఉండి తనని మోసం చేస్తున్నాడని భావించి పార్టీ ని తన కంట్రోల్ కి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటాడు వాసుదేవ్.. రాజకీయాల్లో ఏమాత్రం అనుభవం లేని వరుణ్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడు.. చివరికి రాజకీయనాయకుడిగా వరుణ్ ఉన్నాడా.. తన తండ్రి మీద ఎవరు హత్యా యత్నం చేయించారనేదే మిగితా సినిమా.. 
 
నటీనటులు..
 
ఈ సినిమా కి ప్రధాన బలం విజయ్ దేవరకొండ నటన.. ఒక్కో సినిమా తో ఒక్కో క్యారెక్టర్ లో నటిస్తూ నవరసాలను పలికిస్తున్నాడు.. గీత గోవిందం లో సాఫ్ట్ అబ్బాయి పాత్రను పోషించి మెప్పించిన విజయ్ ఈ సినిమా లో  ఎమోషనల్ రాజకీయనాయకుడిగా, ఆవేశపూరిత యంగ్ స్టర్ గా బాగా నటించాడు.. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో విజయ్ నటన అద్భుతం.. నాజర్, సత్యరాజ్ లు తమ పాత్రల్లో జీవించారు..నాజర్ పాత్ర సినిమాకి మరో బలం.. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటన అమోఘం..  నిజమైన పొలిటిషన్ లలా అనిపించారు.. మెహ్రీన్ ది దాదాపు అతిధి పాత్రే అని చెప్పాలి.. ఇతర నటీనటులు తమ పాత్ర మేరకు బాగా నటించారు..
 
సాంకేతి నిపుణులు :
 
దర్శకుడు ఆనంద్ శంకర్ కథపై ఎక్కువ పట్టు సాధించలేకపోయారు.. కథను వదిలి అనవసరపు స్వారీలవైపు వెళ్లారు.. సినిమా లో విజయ్ దేవరకొండ క్రేజ్ కి తగ్గ సీన్ ఒక్కటి కూడా లేదు.. ముఖ్యంగా సెకండాఫ్ లో కథను వదిలేసి ఇతరవిషయాలపై దృష్టి పెట్టినట్లు అనిపిస్తుంది.. ఈ సినిమా డల్ అవడానికి దర్శకుడిదే పూర్తి బాధ్యత.. సినిమాటోగ్రఫీ చాల బాగుంది. కొన్ని సీన్లలో మంచి ప్రతిభ కనిపించారు.. తెలుగులో లక్ష్మి సినిమాతో మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సామ్ ఈ సినిమా కి ప్రధాన బలహీనత.. తన మ్యూజిక్ తో ఏమాత్రం అలరించలేకపోయారు.. ఎమోషనల్ సీన్స్ లో మ్యూజిక్ తేలిపోయినట్లు అనిపిస్తుంది. స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. మంచి ప్రమాణాలతో ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా చాల బాగా సినిమాను నిర్మించారు. 
 
ప్లస్ పాయింట్స్ :
 
విజయ్ దేవరకొండ
 
నాజర్ 
 
సత్యరాజ్
 
డైలాగ్స్
 
 
మైనస్ పాయింట్స్ :
 
డైరెక్షన్
 
మ్యూజిక్ 
 
ఫైనల్ గా.. సమకాలీన రాజకీయ పరిస్థితులనేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించక పోవచ్చు.. విజయ్ దేవరకొండ నటన తో ఎలాగోలా నెట్టుకొచ్చినా తెలుగు నేటివిటీ లేకపోవడం ఇక్కడి వారికీ పెద్దగా నచ్చదు.. కథ , కథనం, మ్యూజిక్ లాంటి ఎన్నో లోపలున్న ఈ సినిమా ఏదైనా ఆడిందంటే విజయ్ ఎఫెక్ట్ అని చెప్పాలి..
 
టాగ్ లైన్ : వన్ డే – ముఖ్యమంత్రి..
 
రేటింగ్ : 2.5 /5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here