నా సినిమా ఆపేందుకు కృషి చేస్తున్నారు – విజయ్ దేవరకొండ..!!

0
297
vijay devarakonda emotional speech
vijay devarakonda emotional speech

యంగ్ హీరో విజయ్ దేవరకొండ , మెహ్రీన్ జంటగా నటించిన నోటా సినిమా విడుదల దగ్గరవుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ పనులను మరింత వేగవంతం చేసింది.. పబ్లిక్ మీట్ పేరిట సభలు నిర్వహిస్తూ చిత్రానికి మరింత బూస్ట్ ఇస్తున్నారు.. కాగా ,నేడు హైదరాబాద్ లో ఘనం గా పబ్లిక్ మీట్ వేడుక ను నిర్వహించింది.. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ నాగ్ అశ్విన్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ ముఖ్య అతిధులుగా వచ్చారు..

ఈ సినిమా కి జ్ఞానవేల్ రాజా నిర్మాత.. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, సామ్ సి సుందర్ సంగీతం సమకూర్చారు.. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. నిన్న ఏపీ లో ఫస్ట్ పబ్లిక్ మీట్ అయ్యింది.. రెస్పాన్స్ మాములుగా లేదు.. ఇప్పుడు అంతకు మించిన రెస్పాన్స్ ఇక్కడుంది.. ఈ ఈవెంట్ ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు శ్రేయాస్ మీడియా కి చాల థాంక్స్.. ఈ సినిమా రిలీజ్ ఆపేయాలని చాల జరుగుతున్నాయి..అఫడవిట్లు పెడుతున్నారు.. ఎలక్షన్స్ టైం లో సినిమా వస్తుండడంతో ఈ సినిమా చూసి అందరు నోటా బటన్ నొక్కేస్తారని, తెలంగాణ లో ఒక పార్టీ కి ఫేవర్ గా ఈ సినిమా ఉంటుంది అని అంటున్నారు..

అలాంటి ఎలాంటి ఇష్యూస్ ఈ సినిమా లో లేవు.. కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ ఇది.. అయినా సినిమా చూసి ఓటు వేసే పరిస్థితిలో ప్రజలు లేరు.. వాళ్లకు తెలుసు ఏం చేయాలో.. అక్టోబర్ 5 న మీ అందరికి ఓ కొత్త ఫ్రెష్ సినిమా ఇవ్వబోతున్న.. నోటా ద్వారా కంప్లీట్లీ సరికొత్త పొలిటికల్ ఎంటర్టైనర్ ని మీ కు అందిస్తున్నాం.. ఇంకా టైం లేదు.. కౌంట్ డౌన్ మొదలయ్యింది.. ఇంకా నాలుగు రోజులే ఉంది.. 5 న థియేటర్స్ లో కలుద్దాం..నోటా సినిమా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నా.. అన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here