‘చంద్రోదయం’ఫస్ట్ లుక్ విడుదల..!!

320
chandrodayam first look
chandrodayam first look

బయోపిక్ లు రాజ్యమేలుతున్న వేళా మరో బయోపిక్ గుట్టు చప్పుడు కాకుండా తెరకెక్కుతుంది.. అది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర ఆధారం గా తెరకెక్కడం విశేషం.. ఇప్పటికే వైఎస్సార్, ఎన్టీఆర్ వంటి రాజకీయనాయకుల జీవిత చరిత్ర తెరకెక్కుతున్నాయి..

ఇప్పుడు చంద్రబాబు నాయుడు బయోపిక్ రావడం అంతటా ఆసక్తిని నెలకొంటుంది.. ఫై.వెంకరణ దర్శకత్వంలో జీజే రాజేంద్ర ఈ సినిమా ని నిర్మిస్తుండగా , చంద్రబాబు నాయుడు పాత్రలో వినోద్ నువ్వుల నటిస్తున్నారు.. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం..

చంద్రబాబు నాయుడు జీవితంలోని కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా దర్శకుడు వెంకటరమణ మాట్లాడుతూ చంద్రబాబు గారు ఒక అరుదైన, ఆదర్శవంతమైన, నాయకుడని ప్రశంశించారు.. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ చివరి దశలో ఉందని, ఎక్కడా తీసిపోకుండా ఎంతో గ్రాండ్ గా చిత్రం తెరకెక్కిస్తున్నామని, అయన తెలిపారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here