చులకనచేస్తే చతికిలపడ్డట్లే..ఆసియా కప్ లో ఇదే హైలైట్..!!

125
asiacup 2018
asiacup 2018

క్రికెట్ ప్రపంచంలో చిన్న జట్లను చులకన చేస్తే చతికిల పడ్డట్లే అనే విషయం చాల రుజువైంది.. ఇండియా కి కూడా అలాంటి పరాభవాలు చాల సార్లే ఎదురయ్యాయి.. బంగ్లాదేశ్ జట్టుపై 2007 ప్రపంచ కప్ లో ఓడిపోయి ఇంటి ముఖం పట్టిన సంగతి తెలిసిందే. జట్టు ఎంత బలంగా ఉన్నా పరిస్థితులు మారిపోతాయి.. ఒక్కసారిగా మ్యాచ్ మొత్తం చిన్న జట్టు వైపు మళ్ళుతాయి..

ఏదేమైనా చిన్న జట్లను చులకన చేసి చూడొద్దు.. ఇక తాజాగా ఆసియా కప్ లో చిన్న జట్టు ఆఫ్ఘానిస్తాన్ సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతాకాదు.. ఏకంగా శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి జట్లకు షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది.. ఎలాంటి అంచనాలు లేకుండా ఆసియా కప్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు ఒక్కో జట్టు ను మట్టికరిపిస్తూ సూపర్ ఫోర్ లో వెనుదిరిగింది. పాక్ తో జరిగిన మ్యాచ్ లో పోరాడి ఓడిన ఆ జట్టు వారి పోరాట పటిమను ప్రేక్షకులు మెచ్చుకోవలసిందే..

ప్రతి ఆసియా కప్ లో ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య పోరు ఉండేది .. కానీ ఈసారి ఆఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ లు కూడా గట్టి పోటీ ఇస్తుండడంతో ఆసియా కప్ పై అందరికి ఇంట్రెస్ట్ పెరిగింగి.. ఇక ఈరోజు ఇండియా ఆఫ్ఘానిస్తాన్ తో తలపడనుంది.. చిన్న జట్టే అయినా గత ప్రదర్శనలు చూస్తుంటే ఆఫ్ఘానిస్తాన్ ను ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేం.. ప్రతి ఆటగాడు కసి తో ఆడుతున్నాడు.. మరి టీం ఇండియా ఏమేం పథకాలు వేస్తుందో చూడాలి.. ఇక ఈ మ్యాచ్ లో బెంచ్ లో ఉన్నవారికి అవకాశం ఇవ్వనుంది టీం మానేజ్మెంట్.. శిఖర్ ధావన్ స్థానంలో రాహుల్, రాయుడు స్థానంలో మనీష్ పాండే ఆడనున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here