మాల్యా, నీరవ్ మోడీ తరహాలో మరో పారిశ్రామిక వేత్త పరారీ..!!

97
another scan in india
another scan in india

వ్యాపారవేత్త విజయ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ తరహాలో మరో వ్యాపారవేత్త ప్రభుత్వరంగ బ్యాంకులకు షాకిచ్చాడు.. స్టెర్లింగ్ బయో టెక్ అధినేత నితిన్ సందేశరా భారత్ కి ఏకంగా 5383 వేల కోట్లు పంగనామం పెట్టి నైజీరియాకు చెక్కేసాడు..

ఆంధ్రాబ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం నుంచి 5283 వేల కోట్లు ఋణం తీసుకుని భారత్ నుంచి చల్లగా జారుకున్నాడు.. ఇప్పటికే నితిన్ మీద సిబిఐ తో పాటు పలు ఈడీ కేసులున్నాయి భారత్ నుంచి జంప్ అవడం ఇక్కడి పాలనా వ్యవస్థ నిర్లక్ష్యానికి నిర్దర్శనం అవుతుంది. గుజరాత్ కి చెందిన నితిన్ కంపెనీ స్టెర్లింగ్ బయో టెక్ ఇచ్చిన రుణాలను చెల్లించకపోవడంతో బ్యాంకులు సిబిఐ కి ఫిర్యాదు చేసాయి..

దాంతో అతనిపై , కంపెనీ భాగస్వామ్యులపై , కుటుంబ సభ్యులపై సిబిఐ విచారణ వేసింది.. కాగా ఆ విచారణ ని తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయాడీ నితిన్.. తీసుకున్న మొత్తాన్ని నితిన్ అక్రమంగా దేశవిదేశాల్లోని అకౌంట్లలోకి మళ్ళించాడని అంటున్నారు.. ప్రస్తుతం నైజీరియాలో ఉన్న నితిన్ కుటుంబాన్ని ఇండియా కి రప్పిచే దిశగా పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here