మారుతీరావు కి మద్దతు తెలిపిన ఆర్యవైశ్యులు..!!

184
huge rally to stop pranay statue
huge rally to stop pranay statue

తెలంగాణ లో ప్రణయ్ హత్య ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. తన కూతురును ప్రేమించి పెళ్ళాడినందుకు మారుతీ రావు ప్రణయ్ ని హత్య చేయించాడు.. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉదంతం కలకలం రేపింది. అయితే పోలీసుల వద్ద ఏమాత్రం కనికరం లేకుండా మారుతీ రావు తాను చంపడం న్యాయమే అని చెప్పాడు..

ఇకపోతే బాధితుల కుటుంబం , ప్రణయ్ భార్య, మారుతీ రావు కుమార్తె అమృత ప్రణయ్ లు ప్రణయ్ చావుకు న్యాయం చేకూరని డిమాండ్ చేస్తూ మిర్యాల గూడా లో ప్రణయ్ విగ్రహం పెట్టాలని డిమాండ్ చేయగా దానికి ఆర్యవైశ్యులు అభ్యంతరం తెలిపారు.. జైల్లో ఉన్న మారుతీ రావు కి మద్దతు కూడా తెలిపారు..

అయితే వారు విగ్రహ ఏర్పాటు కు నిరసనగా నల్గొండ లోని వాసవి భావం నుండి మారుతీ రావు ఉన్న జైలు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విగ్రహం ఏర్పాటు చేయవద్దని కలెక్టరేట్ లో , ఎస్పీ కార్యాలయంలో వినతి పాత్రలను అందించారు. విగ్రహం ఏర్పాటు సెహస్తే తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతింటాయని, కాదని విగ్రహం ఏర్పాటు చేస్తే అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here