శైలజారెడ్డి ఎఫెక్ట్.. దెబ్బకు డిసెంబర్ కి పరార్..!!

291
savyasachi in december
savyasachi in december

ప్రేమమ్ , సాహసం శ్వాసగా సాగిపో, రారండోయ్ చిత్రాలతో మంచి ఉత్సాహంగా ఉన్న నాగచైతన్య కి యుద్ధం శరణం, శైలజ రెడ్డి అల్లుడు సినిమా తో గట్టి ఎదురుదెబ్బే తగిలింది.. ఎన్నో అంచనాలతో వచ్చిన శైలజ రెడ్డి అల్లుడు థియేటర్స్ లో తుస్ మంది.. రమ్య కృష్ణ, అను ఇమ్మానుయేల్ లాంటి స్టార్స్ ఉన్నా.. సినిమాలో దమ్ము లేకపోవడంతో సినిమా చైతు కెరీర్ లో భారీ ఫ్లాప్ గా నిలిచింది..

దాంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన చైతు భార్య సమంత తో కలిసి విదేశాలకు వెళ్ళాడు.. ప్రస్తుతం అయన తదుపరి చిత్రం ‘ సవ్యసాచి’ ని ట్రాక్ లో కి పెట్టే ఆలోచనలో ఉన్నాడు.. ప్రేమమ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం తనకి విజయం ఇస్తుందని అనుకుంటున్నాడు..

నిజానికి శైలజ రెడ్డి అల్లుడు సినిమా కంటే ముందే సవ్యసాచి రిలీజ్ కావలసింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వాళ్ళ శైలజ రెడ్డి ని రిలీజ్ చేసాడు.. అయితే సవ్యసాచి కూడా వచ్చే నెలలో రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఈ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని దర్శకుడితో కలిసి ఇంకొన్ని మార్పులు చేస్తున్నాడట చైతు దాంతో ఈ సినిమా రిలీజ్ డిసెంబర్ కి వెళ్ళిపోయింది. మాలీ హ్యాట్రిక్ హిట్ కొట్టిన చైతు.. హ్యాట్రిక్ ఫ్లాప్ లనుండి తప్పించుకుంటాడా.. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here