ఎల్బీ నగర్ వరకు మెట్రో పరుగులు.. నేడే ప్రారంభం..!!

  138
  hyderabad metro second stage
  hyderabad metro second stage

  హైదరాబాద్ లో గణనీయమైన మార్పులు తెచ్చిన మెట్రో రైలు రెండో దశ లో అమీర్ పేట్ నుంచి ఎల్బీ నగర్ కు పరుగులు తీస్తుంది. నేడు కుట్ర సమక్షంలో ముఖ్య తిధిగా గవర్నర్ నరసింహన్ ఈ రూట్ లో మెట్రో రైల్ ను ప్రారంభించారు.. 16 కిలోమీటర్ల పొడవు, 17 స్టేషన్ల ను కలిగి ఉన్న ఈ రూట్ ని గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు..

  ఈ ప్రారంభోత్సవానికి తలసాని శ్రీనివాస్ యాదవ్, మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.. ఈ సాయంత్రం ఆరు గంటల నుండి ప్రజలందరికి ఈ మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.. కాగా ఎంజిబిఎస్ మెట్రో స్టేషన్ ఆసియ లో నే అతిపెద్ద మెట్రో స్టేషన్ గా అవతరించనుంది.. మియాపూర్- ఎల్బీనగర్, జేబీఎస్ – ఫలక్ నుమా లకు ఇంటర్ చేంజ్ స్టేషన్ ఇది..

  ఒకటి రెండు అంతస్తుల్లో మియాపూర్- ఎల్బీనగర్ ఫ్లాట్ ఫామ్ , మూడు నాలుగు అంతస్తుల్లో జేబీఎస్ – ఫలక్ నుమా ఫ్లాట్ ఫామ్, లు ఉంటాయి.. ఎల్బీనగర్ కి వెళ్లాలంటే మియాపూర్ లో ఒక ట్రైన్ ఎక్కితే సరిపోతుంది.. ఈ కొత్త మెట్రో రైల్ మార్గం తో మొత్తానికి మెట్రో రైల్ పొడవు 46 కిలోమీటర్లకు చేరుకుంది.. దీనితో ఢిల్లీ తర్వాత అత్యధిక పొడవు ఉన్న మెట్రో రైల్ మార్గంగా హైదరాబాద్ మెట్రో అవతరించింది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here