అరకు ఎమ్మెల్యే హత్య వెనకాలనున్న కారణాలివే..!!

160
facts about araku mla muder
facts about araku mla muder

అరకు టీడీపీ ఎమ్మెల్యే సర్వేశ్వరరావు ను నిన్న మావోయిస్టులు చంపేసిన సంగతి తెలిసిందే. ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ఈ హత్య లో అక్కడికక్కడే అయన మృతి చెందారు..నిమిటిపట్టు గ్రామానికి క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లిన సర్వేశ్వరా రావు ను, ఆయనతో వచ్చిన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమా ను కూడా హత్య చేశారు మావోయిస్టులు..

యాభై మంది బృందం తో వెళ్తున్న బస్సును అడ్డగించిన మావోలు.. మిగితావారిని పంపించి వీరిద్దరి తో సుమారు అరగంట చర్చించారు.. చర్చలు విఫలం కావడంతో వారికి అక్కడికక్కడే హత్య చేసారు. కాగా గత కొద్దీ రోజులుగా ఏజెన్సీ ప్రాంతం లో మావోలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.. ప్రతీకార చర్య వారు ఈ దారుణానానికి ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు..

ఈ హత్య కి ముఖ్య కారణం సర్వేశ్వర రావు కి సంబందించిన ఒక క్వారీ అని తెలుస్తుంది.. పర్యావరణానికి దెబ్బతీస్తున్న క్వారీ ని మూసివేయాలని మావోలు చెప్పినా వినకపోవడంతో వీరు ఈ దుశ్చర్య కి పాల్పడ్డారని తెలుస్తుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here