AAA కాన్సెప్ట్ టీజర్.. శ్రీను వైట్ల ఏం చెప్పదలుచుకున్నాడు..!!

0
79

వరుస ఫ్లాప్ లతో ఆల్మోస్ట్ కెరీర్ చరమాంకం అనుకున్న దశలో శ్రీనువైట్ల రవితేజ తో ‘ అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే సినిమా చేస్తున్నాడు.. వరుణ్ తేజ్ తో మిస్టర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత చాల గ్యాప్ తీసుకుని మంచి కథ తో , వినూత్నమైన స్క్రీన్ ప్లే వస్తున్న ఈ సినిమా లో రవితేజ సరసన ఇలియానా నటిస్తుండడం విశేషం..

తెలుగులోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తో మళ్ళీ తెలుగులో బిజీ అయ్యే ప్లాన్ వేసింది.. అయితే తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ అని రిలీజ్ చేసి శ్రీనువైట్ల అందరిని ఆకట్టుకున్నాడు.. నేడు శ్రీనువైట్ల బర్త్ డే సందర్భంగా ఓ టీజర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం..

ఈ టీజర్ లో ముగ్గురి పాత్రల లుక్స్ ని చూపించాడు వైట్ల.. ముగ్గురు ఎదో ఆలోచిస్తున్న ఈ టీజర్ అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది..ఈ టీజర్ ద్వారా అసలు శ్రీనువైట్ల చెప్పదలుచుకున్నది ఏంటా అని ఆలోచించడం మొదలు పెట్టారు.. మూస సినిమాలు రాజ్యమేలుతున్న ఈ టైం లో ఇలాంటి సినిమా లు రావడం టాలీవుడ్ కి మంచి పరిణామం.. మరి ఈ సినిమా తో అటు రవితేజ,. ఇటు శ్రీనువైట్ల సక్సెస్ బాట పడతారా అన్నది చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here