బాలయ్య, వెంకీ లను లెక్కచేయని అఖిల్..!!

415

తన మొదటి రెండు సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డా అఖిల్ తన ప్రయత్నాన్ని వదులుకోలేదు.. ఈసారి ఎలాగైనా ప్రేక్షకుల మనసు దోచే ప్రయత్నంలో పడ్డాడు.. తొలిప్రేమతో హిట్ కొట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను అనే సినిమా చేస్తున్నాడు అఖిల్.. ఇప్పటికే సినిమా చిత్రీకరణ చివరి దశకి చేరుకోగా, త్వరలో ఆడియో రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు..

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ సినిమా ని సంక్రాంతి కి రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తుంది.. బాలకృష్ణఎన్టీఆర్ బయోపిక్, వెంకటేష్ F2 , రామ్ చరణ్ బోయపాటి సినిమాలు రిలీజ్ కి ఉన్నా అఖిల్ ఏమాత్రం ఖాతరు చేయకుండా రిలీజ్ చేయబోతున్నాడట.. మరీ అఖిల్ మూడో ప్రయత్నం సఫలమవుతుందా చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here