మోడీ సర్కారు అవినీతికి పాల్పడింది.. వెల్లడైన నిజాలు..!!

125
modi sarkar in rafel curruption
modi sarkar in rafel curruption

ఇండియా లో కుంభకోణాలు కొత్తేమీ కాకున్నా ఇలాంటి కుంభకోణాలు కూడా జరుగుతాయా అన్న ఆశ్చర్యాన్ని మాత్రం కలిగిస్తాయి.. తాజాగా మరోసారి ఓ సంఘటన వెలుగు చూసింది.. రాఫెల్ యుద్ధ కొనుగోలు విషయంలో మోడీ సర్కారు వ్యవహరించిన తీరు అవినీతి కి పాల్పడడమే అని ప్రతిపక్షాలు అంటున్నాయి.. గతంలో మోడీ ఫ్రాన్స్ పర్యటనలో అప్పటి అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌ ని కలిసి శత్రు దేశాలు తమ తమ సైనిక బలాన్ని పెంచుకుంటున్నాయి..

తాము కూడా తమ సైనిక బలాన్ని పెంచుకునే విధంగా 36 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలనుకుంటున్నాంవాటి తయారీకి సహకరించాలని కోరగా అందుకు ఫ్రెంచ్ ఆయుధ సంస్థ డసాల్ట్ ఏవియేషన్‌ తో భారతదేశం ఓ అగ్రిమెంట్ కుదుర్చుకుంది.. ఆ టైం లో రిలయన్స్‌ డిఫెన్స్‌ ను సర్వీస్ ప్రొవైడర్ గా డసాల్ట్ ఏవియేషన్‌ నియమించుకోగా, మోడీ సర్కారు విమానాల తయారీ లో భాగంగా రిలయన్స్‌ డిఫెన్స్‌ ను సర్వీస్ ప్రొవైడర్ గా డసాల్ట్ ఏవియేషన్‌ ఏరికోరి ఎంచుకుంది ఇందులో తమ ప్రమేయం ఏదీ లేదని చెప్పింది..

కానీ తాజా పరిణామాలు చూస్తుంటే మోడీ సర్కారు పెద్ద అవినీతికి పాల్పడింది అని తెలుస్తుంది.. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో డసాల్ట్ ఏవియేషన్‌ తో రాఫెల్ విమాన తయారీలో భాగస్వామిగా రిలయెన్స్ ని చేర్చుకోమని ఇండియా నే ప్రతిపాదించింది వెల్లడించాడు..

దీంతో కేంద్రం భూటకపు నాటకాలాడుతోందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.. ప్రభుత్వం కావాలనే ప్రభుత్వ రంగ సంస్థ అయినా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ని పక్కకు నెట్టి భారీ కమిషన్ తో రిలయన్స్ డిఫెన్స్ కి ఈ కాంట్రాక్ట్ ని అప్పగించింది విమర్శలు చేస్తున్నారు.. గతంలో ఆయుధాల తయారీలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వజ్రాయుధం.. కానీ ఇంత టి సంస్థని వదిలేసి రిలయన్స్ కి ఈ పని అప్పగించడం అనుమానాలకు దారి తీస్తుంది. కాగా ఈ వార్తలపై ఇప్పటివరకు బిజెపి నుంచి ఎలాంటి స్పందన రాలేదు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here