కేటీఆర్ , హరీష్ రావు ల మధ్య ఏం జరుగుతుంది..!!

  123
  ktr harish rao issue in trs
  ktr harish rao issue in trs

  తెలంగాణ లో ఎన్నికల సమరం మోగింది.. ఇప్పటికే టీఆరెస్ 119 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అందరిలో ఆసక్తి పెరుగుతుంది.. కానీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం ఇవన్నీ ఏం పట్టించుకున్నట్లు కనిపిస్తుండడం లేదు..

  నివేదన సభ అని ఆర్భాటంగా పెద్ద ఎత్తున సభ పెట్టి న మరుసటి రోజే అసెంబ్లీ రద్దు చేశారు. ఆ తర్వాత 50 రోజులు 100 సభలు అని చెప్పినా సిద్ధిపేట జిల్లాలో ఒక్కసభతోనే సరిపెట్టుకున్నారు.. ఇంతకీ కేసీఆర్ కి ఏమైంది.. కేసీఆర్ కి సొంత ఇంట్లోనే పోరు మొదలయ్యిందా.. కేటీఆర్ , హరీష్ రావు కి పొసగట్లేదు అని ఒకవైపు వాదన వినిపిస్తున్న వేళ కేసీఆర్ మౌనం వీడకపోవడం విపక్షాలకు ఇవి అస్త్రాలుగా మారుతున్నాయి..

  ఇప్పటికైనా కేసీఆర్ నోరు విప్పి సమాధాన ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో తెరాస దెబ్బతినే ప్రమాదముంది.. ఇప్పటికైతే అన్ని సర్వే ల్లో టీఆరెస్ కి అనుకూల ఫలితాలొచ్చినా ఈ చిన్ని మచ్చ పార్టీ ప్రతిష్ఠకే భంగం కలిగించేలా ఉంది.. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ నోరు విప్పి నిజం చెప్పాలని టీఆరెస్ అభిమానులు కోరుకుంటున్నారు…

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here