ఐరాస లో చంద్రబాబు ప్రసంగం.. ఐదు రోజుల పాటు అమెరికా పర్యటన..!!

106
chandrababu speech in united nations
chandrababu speech in united nations

న్యూజెర్సీ లోని ఐరాస లో చంద్రబాబు తన ప్రసంగాన్ని వినిపించడానికి నేడు అమెరికా బయలుదేరి వెళ్లనున్నారు.. భారత కాలమాన ప్రకారం 25 వ తేదీ తెల్లవారు జామున 3 గంటలకు చంద్రబాబు ప్రసంగించనున్నారు..న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి లో ప్రపంచ ఆర్ధిక వేదిక బ్లూంబెర్గ్‌ నిర్వహించే ‘సుస్థిర అభివృద్ధి – ప్రభావం’ సదస్సులో అయన ప్రసంగించనున్నారు..

పైసా పెట్టు బడి లేకుండా వ్యవసాయం చేయడం, దానికి అమెరికన్ సాంకేతిక, మేథో పరిజ్ఞానాన్ని జోడించేందుకు పరస్పర సహాయ సహకారాలపై అయన ప్రసంగించనున్నారు.. రేపటినుండి 26 వరకు చంద్రబాబు అమెరికా లో పర్యటించనున్నారు.. ఈనెల 28 న తిరిగి ఇండియా కి రానున్నారు.. ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన పలువురు పెట్టుబడి దారులు, పారిశ్రామిక వెతలు, సాంకేతిక నిపుణులు హాజరు కానున్నారు..

అలాగే 23 న టీడీపీ ఆధ్వర్యంలో న్యూజెర్సీ లో నిర్వహించే బహిరంగ సభలో కూడా చంద్రబాబు ప్రసంగించనున్నారు.. టీడీపీ ఇప్పటివరకు సాధించిన అభివృద్ధి, ప్రవేశ పెట్టిన అభివృద్ధి పథకాలను వెల్లడించనున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here