RX100 హీరో కొత్త చిత్రం షురూ..!!

0
127

RX100 చిన్న చిత్రంగా వచ్చి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. ఈ స్టోరీ ఎంత బాగుందో అందులో నటించే నటీనటులు కూడా అంతే బాగా నటించారు.. ముఖ్యంగా ఈ సినిమా లో హీరో గా చేసిన కార్తికేయ కి మంచి పేరొచ్చింది.. తన అసాధారణ నటనతో ప్రతి ప్రేక్షకుడిని మెప్పించి అందరి మనసులో ముద్ర వేశాడు.. మాస్ ప్రేక్షకుల ను విశేషంగా ఆకట్టుకున్న కార్తికేయ తన రెండో సినిమా ని అనౌన్స్ చేసాడు..

ఎప్పుడెప్పుడు ఈ కుర్రాడి తదుపరి సినిమా వస్తుందని ఎదురుచూస్తున్న అభిమానులకు కోరిక నేడు తీరింది.. తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఈ సినిమా ని కళై పులి ఎస్.థాను నిర్మిస్తుండగా, టి.ఎస్ కృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘హిప్పీ’ అనే పేరును నిర్ణయించారు.. కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా నేడు ఫస్ట్ లుక్ ని రెవీల్ చేసారు. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here