ఆసియ కప్ లో పాక్ ని చిత్తు చేసిన భారత్..!!

67
india won pak by 8 wickets
india won pak by 8 wickets

అనుకున్నదే అయ్యింది.. ఆసియ కప్ లో పాక్ ని భారత్ చిత్తు చేసి ఓడించింది. యూఏఈ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాక్ పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని చేరుకుంది. అంతకు ముందు బ్యాటింగ్ కి దిగిన పాకిస్థాన్ 162 పరుగులకే కుప్ప కూలిపోయింది. భువనేశ్వర్ 3 -15 టాప్ ఆర్డర్ ని దెబ్బతీయగా, కేదార్ జాదవ్ 3 – 21 మిడిల్ ఆర్డర్ ని కోలుకోనీయకుండా చేశారు.. ఆదిలోనే రెండు వికెట్లను కోల్పోయిన పాక్ ని పాక్ బ్యాట్స్ మాన్ బాబర్ అజామ్ , షోయబ్ మాలిక్ నిలబెట్టే ప్రయత్నం చేశారు కానీ భారత్ బౌలర్ల ధాటికి ఎక్కువ సేపు నిలవలేకపోయారు..

163 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ తనదయిన శైలిలో బ్యాట్ ఝుళిపించాడు. కేవలం 39 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి విజయాన్ని సులువుగా దక్కేలా చేసాడు..రోహిత్ అవుట్ తర్వాత ధావన్, రాయుడు, దినేష్ కార్తిక్ లు విజయ తీరాలకు చేర్చారు..ఈ విజయంతో సూపర్ 4 లోకి ప్రవేశించిన ఇండియా ఆ తరువాతి మ్యాచ్ లో బాంగ్లాదేశ్ తో శుక్రవారం తలపడనుంది.. నేడు బంగ్లా, ఆఘ్ఫనిస్థాన్ ల మధ్య మ్యాచ్ జరగనుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here