అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ..!!

153
balakrishna next movie with anil ravipudi
balakrishna next movie with anil ravipudi

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసిన మొదటి సినిమా నుంచి సూపర్ హిట్ కొట్టి టేస్ట్ ఉన్న దర్శకుడిగా పేరు సంపాదించాడు.. ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ లతో F2 అనే సినిమా చేస్తున్నాడు.. క్రేజీ మల్టి స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో మెహ్రీన్ , తమన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా అనిల్ రావిపూడి తన తర్వాతి చిత్రాన్ని బాలకృష్ణ తో చేయనున్నాడట..

ఇప్పటికే బాలయ్య కి ఓ కథ చెప్పడం అది అయన ఒకే చేయడం అయిపోయాయట.. అన్ని కుదిరితే ఈ ప్రాజెక్ట్ త్వరలోఈ పట్టాలెక్కనున్నాడన్నమాట.. ప్రస్తుతం బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తుండగా, ఆ తర్వాత బోయపాటి తో సినిమా చేయనున్నాడు.. ఆ తర్వాత అనిల్ రావిపూడి సినిమాని మొదలు పెట్టె ఆలోచనలో ఉన్నాడట.. అన్నీ కుదిరితే ఒకేసారి రెండు సినిమాలు కూడా చేసే దిశగా పనులు సాగిస్తున్నాడట..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here