ఎన్టీఆర్ లో ఏఎన్నార్..అచ్చు ఆయనే వచ్చారా..!!

50
ANR Look In ntr biopic
ANR Look In ntr biopic

ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ లుక్ ని నేడు ఏఎన్నార్ 94 వ జయంతి సందర్భంగా రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఈ లుక్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు సుమంత్.. ఈ సినిమా లో ఏఎన్నార్ గా సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే.. ‘ ఈరోజు ఏఎన్నార్ జయంతి.. పుట్టినరోజు శుభాకాంక్షలు తాత.. సినిమాలో ఇది నా లుక్ ‘ అంటూ ట్వీట్ చేసాడు..

నిజానికి సుమంత్ ఏఎన్నార్ పాత్రలో ఒదిగిపోయారనే చెప్పాలి.. తలకట్టు, మీసం, కళ్ళజోడు తో తాతను దించేసాడు సుమంత్.. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, బసవతారకం పాత్రలో విద్య బాలన్ నటిస్తుంది. షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు ఇది వరకే ప్రకటించగా, తెలుగు , తమిళంలో పాటు హిందీ లోనూ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here