చావు తప్పి కన్ను లొట్టపోవడమంటే ఇదే.. హాంగ్ కాంగ్ నుంచి టీం ఇండియా కి గట్టి పోటీ..!!

87
india vs hong kong asia cup 2018
india vs hong kong asia cup 2018

నిన్న పసికూన హాంగ్ కాంగ్ తో జరిగిన ఆసియ కప్ మ్యాచ్ లో కన్ను లొట్టబోయి చావు తప్పినంత పనైంది భారత్ కు.. సింపుల్ గా ఓడించవచ్చు అనుకున్న జట్టే తమలోని ప్రతిభను శాంపిల్ గా చూపించి తమని తక్కువ అంచనా వేయవద్దని చెప్పింది.. ఏదైతేనేం ఇండియా గెలిచిందనేకంటే హాంగ్ కాంగ్ పోరాడి ఓడిందనుకోవచ్చు.. మొదటి వికెట్ కి 174 పరుగుల భాగస్వామం చేసి భారత్ శిబిరాల్లో వణుకు పుట్టించింది.

ఆ తర్వాత పేసర్ మహ్మద్ ఖలీల్ , చాహల్,కుల్దీప్ ల దెబ్బకు 258 పరుగులకే పరిమితమయి 26 పరుగులతో ఓడిపోయింది.. అంతకుముందు టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన భారత్ శిఖర్ ధావన్ సెంచరీ తో నిర్ణీత యాభై ఓవర్లలో 285 పరులు చేసింది.. ధావన్ కి రాయుడు (60), కార్తిక్ (33) కేదార్ జాదవ్ (28) అండగా నిలిచారు.. కాగా ఈ మ్యాచ్ ద్వారా భారత్ రెండు రికార్డులను మూటకట్టుకుంది.. 33 ఓవర్ల వరకు వికెట్ తీయకుండా ఉండడం భారత్ కి ఇది మూడో సారి.. ఇక 24 వన్ డే ల్లో 50 వికెట్లు తీసిన ఆటగాడిగా కులదీప్ యాదవ్ రికార్డులకెక్కాడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here