అక్టోబర్ 5 న ‘వీర భోగ వసంత రాయలు’..!!

160
veera bhoga vasantha rayalu release date
veera bhoga vasantha rayalu release date

నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియా శరణ్, శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం ‘ వీర భోగ వసంత రాయలు ‘.. ఇంద్రసేన ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ నాన్ లీనియర్ డ్రామా సినిమా ని అక్టోబర్ 5 న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.. ఇప్పటికే సినిమా ప్రధాన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్, టీజర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.వినూత్నమైన కథతో సరికొత్తగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది..

‘కల్ట్ ఈజ్ రైజింగ్’ అనే టాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రోజు రోజు అంచనాలను పెంచుకుంటుంది.. కాగా సినిమా రిలీజ్ దగ్గరపడడంతో ఆడియో ఫంక్షన్ కి ప్లాన్ చేస్తున్నారు.. త్వరలో అఫీషియల్ గా డేట్ అనౌన్స్ చేయనున్నారు. బాబా క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై అప్పారావు బెల్లనా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా ఎస్ వెంకట్ సినిమాటోగ్రఫీ ని నిర్వర్తిస్తున్నారు..

నటీనటులు : నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియా శరణ్ మరియు శ్రీ విష్ణు

సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: ఇంద్రసేన.ఆర్
నిర్మాతలు: అప్పారావ్ బెల్లన
బ్యానర్: బాబా క్రియేషన్స్
సంగీతం : మార్క్ కె రాబిన్
DoP: S వెంకట్, నవీన్ యాదవ్
ఎడిటర్: శశాంకర్ మాలి
ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రమిశెట్టి
PRO: వంశీ శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here