శ్రీకాంత్ అడ్డాల తో యంగ్ హీరో..!!

79
srikanth addala next movie with sharvanand
srikanth addala next movie with sharvanand

బ్రహ్మోత్సవంతో కోలుకోలేని పరాజయాన్ని చవిచూసిన శ్రీకాంత్ అడ్డాల ఎట్టకేలకు ఓ సినిమా ని పట్టాలెక్కించబోతున్నాడు.. ఈ సినిమా ని గీత ఆర్ట్స్ నిర్మించడం విశేషం.. గీత గోవిందం సినిమా తో సూపర్ హాట్ కొట్టిన ఈ సంస్థ తాజాగా పేపర్ బాయ్ ని ప్రజెంట్ చేసిన చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా లు ఇచ్చిన ఉత్సాహంతో మరో యంగ్ హీరో తో ఈ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు..

ప్రస్తుతం హను రాఘవపూడి తో పడి పడి లేచే మనసు సినిమా చేస్తున్న శర్వానంద్ ఈ సినిమాకి హీరో.. ఈ ప్రాజెక్ట్ తర్వాత సుధీర్ వర్మ తో ఓ సినిమా చేస్తున్న శర్వా ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల సినిమా చేయనున్నాడు.. బ్రహ్మోత్సవం భారీ ఫ్లాప్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఈ సారి హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు శ్రీకాంత్.. మరీ శ్రీ కాంత్ ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here