కాంగ్రెస్ వస్తే ప్రత్యేక హోదా గ్యారెంటీ.. రాహుల్ హామీ..!!

24
rahul gandhi in kurnool
rahul gandhi in kurnool

కర్నూలు లో విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో రాహుల్ గాంధీ మరోసారి ఎపి కి ప్రత్యేక హోదా విషయాన్నీ ప్రస్తావించారు.. బైరెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన ముఖాముఖిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి తప్పక ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు.. ప్రత్యేక హోదా విషయంలో నే కాదు ఏపీ కి కేంద్రం నుండి ఎలాంటి సహాయం కావాలో అన్ని అందిస్తామని ప్రకటించారు..

ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ విఫలమయ్యారని, కొన్ని కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. నిరుద్యోగాలకు ఉద్యోగాలు కల్పిస్తామని భరోసాతో గద్దెనెక్కిన మోడీ అది సఫలం చేయడంలో విఫలమయ్యాడని చెప్పారు.. చైనా లో నెలకు 50 వేల ఉద్యోగాలు సృష్టిస్తుంటే ఇండియా మాత్రం 450 కి మాత్రమే పరిమితమయ్యింది అని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here