కొంగర కలాన్ కి ఆపేరెలా వచ్చింది..!!

295
kongarakalan name mystery
kongarakalan name mystery
ప్రగతి నివేదన సభ పుణ్యమా అని “కొంగర కలన్” బాగా పాపులర్ అయిపోయింది అయితే ఈ ప్రాంతానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అని ఆసక్తి తో వివరాలను వెలికి తీస్తే …  ఖుర్ద్, కలన్ అనేవి మరాఠాల నుండి నిజాం పరిపాలనలోకి ప్రవేశించిన పదాలు. ఖుర్ద్ అంటే చిన్నది, కలన్ అంటే పెద్దది. ఒక ఊరు ఏర్పడి క్రమంగా అది పెద్దదయినప్పుడు, ఆ ఊళ్ళో పెద్దభాగాన్ని ఆ ఊరిపేరుకి చివర “కలన్” చేర్చి పిలుస్తారు. ఉదా: కొంగర కలన్. కొంగర అనేది ఆ ఊరి పేరు. ఊరు పెరగడంవల్ల పొలాలకి దగ్గర్లో క్రమేణా కొత్తనివాసాలు ఏర్పడతాయి. అక్కడ కూడా ఊరు తయారవుతుంది. అలా కొత్తగా ఏర్పడిన చిన్న భాగాన్ని ఖుర్ద్ అనే సఫిక్స్ చేర్చి పిలుస్తారు. అంటే బహుశా కొంగర ఖుర్ద్ కూడా ఉండి ఉండొచ్చు. మనకి బాగా తెలిసిన ఉప్పల్ కి కూడా ఉప్పల్ కలన్ అనే పెద్దభాగం ఉంది .
పంజాబ్, హర్యానా, పాకిస్తాన్, హిమాచల్ ప్రదేశ్..ఇలా అనేకచోట్ల ఖుర్ద్, కలన్ అనే వాడుక ఉంది. ఇక్కడ కొంగర అనేది “కింకర” అనే సంస్కృత పదం అపభ్రంశం చెంది ఏర్పడి ఉండొచ్చు అని ఒక ఆలోచన. కింకరులు అంటే భృత్యులు, సేవకులు. బహుశా వారు నివాసం ఉన్న ఊరు అనే అర్ధంలో కావచ్చేమో. ఖచ్చితంగా అయితే చెప్పలేం. ఇలాంటి విధానాన్ని కన్నడంలో కూడా ఉపయోగించారు.. చిక్క బళ్ళాపూర్, దొడ్డ బళ్ళాపూర్ . చిక్క అంటే చిన్నది, దొడ్డ అంటే పెద్దది. తెలుగులో దొడ్డమ్మ అంటే పెద్దమ్మ. అమ్మ కంటే పెద్దది. దొడ్డ మనసు అంటే పెద్దమనసు. ఈ కోవలోనే చిక్కమగుళూరు, దొడ్డమల్లూరు, మన రాష్ట్రంలో పెదరావూరు, చినరావూరు, పెద కంచెర్ల, చిన కంచెర్ల లాంటి ఊరిపేర్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here