వయాకామ్ 18 భాగస్వామ్యంలో దేవదాస్ ..!!

0
13
devdas partnering with viacom 18

అక్కినేని నాగార్జున , నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రల్లో వస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ ‘దేవదాస్’.. ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర ఫస్ట్ లుక్ ,టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రాగా ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు.. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా, ఆకాంక్ష సింగ్ లు హీరోయిన్లు గా నటించగా, మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు..

షాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.. కాగా సి.ధర్మరాజు సమ్పర్పిస్తున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు.. సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. తాజాగా వైజయంతి మూవీస్ తో ముంబై కి చెందిన
‘Viacom 18’ సంస్థ ఈ సినిమా లో భాగస్వామ్యం అయ్యింది.. సౌత్ లొనే తన మొదటి సినిమాకు గాను ఈ సంస్థ అసోసియేట్ అవడం విశేషం..

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. Viacom 18 లాంటి గొప్ప సంస్థ తో అసోసియేట్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.. సౌత్ ఇండియా లో వారు చేస్తున్న మొదటి సినిమా ఇది.. వారు ఇలా మరిన్ని తెలుగు సినిమాలు చేయాలి అని కోరుకుంటున్నాం అన్నారు..

తారాగణం: నాగార్జున అక్కినేని, నాని, రష్మికా మందన్నా, ఆకాంక్ష సింగ్, నరేష్ వికె, రావు రమేష్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్ మరియు ఇతరులు

సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత : అశ్వినీ దత్
బ్యానర్లు: వైజయంతి మూవీస్ మరియు వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్
సంగీతం: మణిశర్మ
డిఓపి: షాందత్ సైనుద్దీన్
ఆర్ట్ : సాహి సురేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here