సెప్టెంబర్ 20 న దేవదాస్ ఆడియో..!!

285
devdas audio launch
devdas audio launch

అక్కినేని నాగార్జున , నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రల్లో వస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ ‘దేవదాస్’.. ఈ చిత్ర ఆడియో తేదీ ని తాజాగా ప్రకటించారు చిత్ర నిర్మాతలు.. సెప్టెంబర్ 20 న హైదరాబాద్ లో ఆడియో పార్టీ ని జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర ఫస్ట్ లుక్ ,టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రాగా ముఖ్యంగా వినాయక చవితి సంధర్భంగా రిలీజ్ అయిన ‘ లక లక లకుమీకర’ పాటకు విశేష స్పందన వచ్చింది..

ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు.. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా, ఆకాంక్ష సింగ్ లు హీరోయిన్లు గా నటించగా, మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.. కాగా ఈరోజు నాగార్జున నాని లు ట్విట్టర్ ద్వారా సినిమా లో తమ జోడీలుగా నటించిన హీరోయిన్స్ ని పరిచయం చేసారు.. షాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.. కాగా సి.ధర్మరాజు సమ్పర్పిస్తున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు.. సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. తాజాగా వైజయంతి మూవీస్ తో ముంబై కి చెందిన
‘Viacom 18’ సంస్థ ఈ సినిమా లో భాగస్వామ్యం అయిన సంగతి తెలిసిందే.. ..

తారాగణం: నాగార్జున అక్కినేని, నాని, రష్మికా మందన్నా, ఆకాంక్ష సింగ్, నరేష్ వికె, రావు రమేష్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్ మరియు ఇతరులు

సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత : అశ్వినీ దత్
బ్యానర్లు: వైజయంతి మూవీస్ మరియు వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్
సంగీతం: మణిశర్మ
డిఓపి: షాందత్ సైనుద్దీన్
ఆర్ట్ : సాహి సురేష్
P.R.O : వంశీ శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here